బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధించింది నాంపల్లి కోర్టు. 2015లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు బిజెపి కార్యకర్తలతో ఎమ్మెల్యే రాజాసింగ్ వెళ్లారు. ఓయూలో రాజాసింగ్ ను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బొల్లారం ఇన్స్పెక్టర్ బీజేపీ కార్యకర్తలను కొట్టారని గొడవ పడ్డారు రాజాసింగ్. దీంతో రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వెంటనే రాజాసింగ్ కు బెయిల్ వచ్చింది. దీనిపై రాజాసింగ్ నాంపల్లి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నారు.