నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన శ్రీశైలం గౌడ్..

నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన శ్రీశైలం గౌడ్..

కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఢిల్లీలో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. శ్రీశైలం గౌడ్ ఈరోజే మేడ్చల్ డీసీసీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు..