న్యాయంగా రాష్ట్రానికి కావాల్సిన నిధులతో పాటు, జాతీయ రహదారులను వేసిన ఘనత కేంద్రానిదే….కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి..

నల్గొండ…..
నల్గొండ పట్టణంలోని చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హల్ లో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి హాజరైన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి…

*కిషన్ రెడ్డి కామెంట్స్….*

పట్టభద్రుల నియోజకవర్గానికి బీజేపీ కి అవినాభావ సంబంధం ఉంది…

పట్టభద్రుల నియోజకవర్గం అంటే బీజేపీ కి కంచుకోట

టిఆర్ఎస్ అనుకూల వాతావరణంలో కూడా బిజెపి గెలిచింది..

టిఆర్ఎస్ 7 యేండ్ల పాలనలో నిరుద్యోగులు, ఉద్యోగులు టిఆర్ఎస్ పై వ్యతిరేకతతో వున్నారు

ఎన్నికలు వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్ పూనకం వచ్చినట్లుగా అబద్ధాలు ఆడుతున్నారు…

Trs కేసీఆర్ కుటుంబ పార్టీ గా టిఆర్ఎస్ తయారైంది..

న్యాయంగా రాష్ట్రానికి కావాల్సిన నిధులతో పాటు, జాతీయ రహదారులను వేసిన ఘనత కేంద్రానిదే

రైతు బంధు, డిఫెన్సు ఉత్పత్తులు, ఆర్ ఆర్ ఆర్ వరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంది

గత పార్లమెంట్ ఎన్నికల నాటి నుండి రాష్ట్రంలో టిఆర్ఎస్ వ్యతిరేకత మొదలయ్యింది..

తండ్రి ఒకవైపు, కొడుకు ఒక వైపు, అల్లుడు ఒక వైపు కంటికి రెప్పలా చూసుకున్న దుబ్బాక లో టిఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి కాషాయ జెండా ఎగరేసిన ఘనత బీజేపీ ది

900 కోట్ల ప్రజాధనాన్ని జిహెచ్ఎంసి లో పంచుతామని, టిఆర్ఎస్ లీడర్లు జేబులో వేసుకున్నారు..ప్రజలు తగిన బుద్ధి చెప్పారు

తెలంగాణ ప్రజలు మార్పు రావాలని కోరుతున్నారు..కుటుంబ పాలన పోవాలని కోరుతున్నారు…

రామగుండం లో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, తెలంగాణ రైతుల కోసం తీసుకొచ్చి యూరియా ను ఉత్పత్తి చేస్తున్నాం…

ఎన్టీపీసీ నిర్మాణం వేగవంతం గా జరుగుతుంది

గత 6 సంవత్సరాలలో జాతీయ రహదారులను అద్భుతంగా నిర్మిస్తున్నాం..

రీజనల్ రింగు రోడ్డు తెలంగాణ అభివృద్ధి కి మణిపూస అవుతుంది

రైల్వే ప్రాజెక్ట్ మంజూరు చేస్తే..రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయడంలో విపలమవ్వడం వల్ల ప్రాజెక్టు మొదలు కాలేదు..

ఎంఎంటీఎస్ సెకండ్ ఫేస్ ఆగిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడమే…

7 సంవత్సరాలుగా పంచాయితీలకు, మున్సిపాలిటీ లకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి..

కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది…

ఇరిగేషన్ ప్రాజెక్టులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎం ల లాగా మారిపోయాయి…

ఎప్పుడంటే అపుడు అంచనాలు పెంచుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు…

ప్రజాధనాన్ని అప్పనంగా స్వాహా చేస్తున్నారు…

కేంద్రాన్ని, మోదీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు…

ఎయిమ్స్ మెడికల్ కళశాల ఎయిమ్స్ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి తీసుకొస్తే…ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బిల్డింగ్ లు ఇవ్వలేదు..

ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా లేదు..

కొత్త ఆసుపత్రులు కట్టకపోగా ఉన్న ఆసుపత్రులకు తాళం వేసాడు…

వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎన్నో నిధులు కేటాయించింది..

ఎక్కడ చూసినా టిఆర్ఎస్ నాయకుల భూ అక్రమనలే

దౌర్జన్యాలు పెరిగిపోయాయి..

ఉద్యమ కాలంలో తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో..వారు ఇపుడు ప్రగతిభవన్ లో కూర్చుని ప్రజలను పాలిస్తున్నాయి..

తెలంగాణ ను కల్వకుంట్ల కుటుంబం, ఓవైసీ కుటుంబం షాశిస్తున్నాయి ..

సచివాలయానికి రాని ముఖ్యమంత్రి.. సచివాలయం లేని రాష్ట్రము ప్రపంచంలో ఎక్కడా లేదు…

ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పని చేసే వ్యక్తి నరేంద్రమోదీ గారు..

కేసీఆర్ కూర్చున్న డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు జరుగుతున్నాయి…ఆ నిర్ణయాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారు…

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు…

ఇరిగేషన్ ప్రోజెక్టుల కోసం 90 వేల కోట్లు, కేంద్రం రాష్ట్రానికి అప్పులు ఇచ్చింది.తెలంగాణ అభివృద్ధి కోసం..

ఇవన్నీ ఆలోచించి ఈ ఎన్నికల్లో మేధావులు పట్టభద్రులు నిర్ణయం తీసుకుని బిజెపి కి ఓటెయ్యండి…