కాంగ్రెస్ అధిష్టానం దిక్కరించి తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… ఈటెల రాజేందర్..
పలివెల. లో ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ
కాంగ్రెస్ అధిష్టానం దిక్కరించి తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
2018 లో గొప్ప మెజారిటీతో విజయం సాధించాడు.
అధికార పార్టీకి వస్తేనే ప్రోటోకాల్ ఉంటుంది, గౌరవం ఉంటుంది.
అధికార పార్టీకి వస్తేనే నిధులు వస్తాయి అని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.
కెసిఆర్ ని ఓడగొట్టకుండ ప్రజాస్వామ్యం బ్రతకడం కష్టం, రాచరికపు కుటుంబ పాలన అంతం కావాలి అని బలంగా రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకొని ఉప ఎన్నికకు సిద్దం అయ్యారు.
కెసిఆర్ వైఖరి నచ్చక అనేక మంది ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరతున్నారు. కెసిఆర్ కి కంపరం ఎక్కి, గుండె బావురు మని ,,బీజేపీ లో చేరే వారి మీద ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులు రావు, నిధులు రావు అని, సస్పెండ్ చేయిస్తాం, కేసులు పెట్టిస్తాం అని బెదిరిస్తున్నారు.
పిడి యాక్ట్ పెట్టినా, sc st కేసులు పెట్టినా, నిధులు ఇవ్వకపోయినా.. కెసిఆర్ పాలన అంతం కావాలి అని ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరుతున్నారు.
హుజూరాబాద్ లో ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా గెలవలేదు అని.. మునుగోడులో తెరాస గెలిపిస్తే తప్ప అభివృద్ధి నిధులు ఇవ్వం అని బెదిరిస్తున్నారట.
21 న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు.
ఆ మీటింగ్ విజయవంతం చేయాలి అని మునుగోడు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను.
కెసిఆర్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు.
కెసిఆర్ రాజీనామా చేసి, మళ్లీ ప్రజాభిప్రాయం కోరాలి.
ప్రజల మీద నమ్మకం ఉంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.