ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో కాదు..ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలి.. బండి సంజయ్..

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో కాదు.. ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. 2023,మార్చి 10వ తేదీ హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా గోస బీజేపీ భరోసా పేరుతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. లిక్కర్ కేసు నుండి తప్పించుకునేందుకే కవిత ఢిల్లీలో దీక్ష చేస్తోందని ఆరోపించారు. సీఎం ఇంటి ముందు కవిత ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మహిళలను అవమానిస్తున్నారని అన్నారు. సీఎం తీరుతో నే రాష్ట్రంలో మహిళలై వరుస ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 33 శాతం మహిళ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు..