బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే ధరణి రద్దు..

ధరణి పోర్టల్‌ను ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములను లాక్కొంటోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే అధికార పార్టీ ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారని ఆరోపించారు..రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకే అధికార పార్టీ ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారని ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఆదివారం ఏర్పాటుచేసిన నవ సంకల్ప బహింరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వెంటనే ధరణి పోర్టల్‌తో పాటు బీఆర్‌ఎస్ పోర్టల్ కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పీఎం ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేసే ఇళ్లలో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు.