రేపు అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ..

R9TELUGUNEWS.COM. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రెండు రోజుల క్రితం అమిత్ షా అపాయింట్ మెంట్ కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దీంతో రేపు అందుబాటులో ఉండాలని సంజయ్ కి తెలిపారు కేంద్ర హోంశాఖ అధికారులు.
ఈ సమావేశంలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర, రాష్ట్ర రాజకీయాలు, ముఖ్యంగా వరి విషయంలో రాష్ట్ర సర్కార్ తీరుపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రితో భేటీ సందర్భంగా రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు ఈటల రాజేందర్. హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఫస్ట్ టైం అమిత్ షాను కలుస్తున్నారు.