టీఆర్ఎస్ కారణంగానే దళిత బంధు ఆగిందని నిరూపించేందుకు నేను సిద్ధం..బండి సంజయ్.

R9TELUGUNEWS.com.

టీఆర్ఎస్ కారణంగానే దళిత బంధు ఆగిందని నిరూపించేందుకు నేను సిద్ధమని సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దళిత బంధు ఆపడానికి బీజేపీ కారణమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు.లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తావా? అని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్ లో మాట్లాడిన బండి సంజయ్..ఈ విషయాన్ని….. యాదాద్రి దగ్గర తేల్చుకుందామని కేసీఆర్ కు సవాల్ విసిరారు…టీఆర్ఎస్ పతనం ఖాయమైందని..బీజేపీని గెలిపిస్తేనే కేసీఆర్ మెడలు వంచి దళిత బంధుసహా అన్నీ ఇప్పిస్తామన్నారు బండి సంజయ్.ఎన్నికల తర్వాత కేసీఆరే తన మనుషులతో కోర్టులో కేసు వేయించి దళిత బంధు డబ్బులు దళితులకు అందకుండా చేస్తాడని ఆరోపించారు. కరోనాతో రాష్ట్రం అల్లాడుతుంటే మన సీఎం మాత్రం ఫాంహౌస్ లో పడుకుని పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందనుకున్నాడని చెప్పారు. ఆయనకు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి పోయి చికిత్స చేయించుకున్నాడని అన్నారు.