దేశం కోసం, ధర్మ కోసం పని చేయడమే సర్దార్ పటేల్‎కు నిజమైన నివాళి..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ …

సర్దార్ పటేల్ 146వ జయంతి సందర్భంగా నిజాంపేట్ క్రాస్ రోడ్స్‎లో ఆయన విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు.

గతంలో పటేల్ జయంతిని గుర్తించని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆయన విగ్రహానికి పూలమాలలు వేస్తోందని సంజయ్ ఎద్దేవా చేశారు. దేశం కోసం, ధర్మ కోసం పని చేయడమే సర్దార్ పటేల్‎కు నిజమైన నివాళి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు పటేల్ విముక్తి కల్పించారని సంజయ్ గుర్తు చేసుకున్నారు..తెలంగాణ ప్రజలకు పటేల్ విముక్తి కల్పించారని సంజయ్ గుర్తు చేసుకున్నారు. అలాంటి నేతకు కేసీఆర్ ఇప్పటివరకూ నివాళి అర్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..