పాతబస్తీ హిందువులకు అడ్డా.. ఎంఐఎం ఆగడాలను భరించలేక చాలా మంది బయటకు వెళ్ళిపోయారు… బిజేపీ బండి సంజయ్

సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు..

ఫామ్ హౌస్ లో ఉన్న కెసిఆర్ ను బీజేపీ గళ్ళ పట్టి గుంజుతేనె బయటకు వచ్చారు… అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు…
జైలుకు పోతానన్న భయంతోనే దేశంలో కెసిఆర్ తిరుగుతున్నాడు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ కు ఇంటిపోరు ఎక్కువైంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అమలు చేసి తీరుతాం అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ కేసులకు బీజేపీ కార్యకర్తలు భయపడరు. లాఠీలు కొనటానికి.. కొత్త జైళ్ళు నిర్మించుకోవడానికి ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించుకోవాలి. పాతబస్తీలో గణేష్ నిమజ్జనం కార్యక్రమానికి కేసీఆర్, అసదుద్దీన్ లు ఎందుకు హాజరుకావటం లేదు. ముస్లిం, క్రిస్టియన్ పండుగలకు సోదరసోదరీమణులంటూ ఫ్లెక్సీలు కడతారు. హిందువుల పండుగలకు మాత్రం హిందుబంధువులు, సోదరసోదరీమణులంటూ శుభాకాంక్షలు చెప్పే ధైర్యం టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు బండి సంజయ్….
తెలంగాణ కాషాయ అడ్డ. బీజేపీ అధికారంలోకి వచ్చాక దారూసలాంను ఆక్రమిస్తామన్నారు. అవకాశం ఇస్తే..ఓల్డ్ సిటీని న్యూసిటీగా చేసి చూపిస్తామన్నారు. పాతబస్తీలో హిందువుల,
ఘర్ వాపసీ కార్యక్రమం మెదలు పెడతామన్నారు. భాగ్యనగరానికి ఐకాన్ గా భాగ్యలక్ష్మీ దేవాలయం నిలిచిందన్నారు బండి సంజయ్. పాతబస్తీ హిందువులకు అడ్డా.. ఎంఐఎం ఆగడాలను భరించలేక చాలా మంది బయటకు వెళ్ళిపోయారన్నారు. హైద్రాబాద్ పార్లమెంట్ ను బీజేపీ ఎందుకు గెలవదో చూద్దామన్నారు. ఎంఐఎం గూండాల నుంచి తెలంగాణను విముక్తి కల్పిస్తామన్నారు.