సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్.

కరీంనగర్ జిల్లా: జనవరి 24
కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వు లు ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించ కపోవడం దురదృ ష్టకరం అని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచుల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన మీరు ఈ అంశాన్ని పట్టించుకోక పోవడం శోచనీయం అని బీజేపీ ఎంపీ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి అని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారిమళ్లించింది అని ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకు న్నారు. అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారు.. గ్రామాభివృద్ధికి సర్పంచులు చేసిన పనులను వెంటనే రికార్డు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు…