ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు..కౌంటర్ ఇచ్చిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నూకలు తినాలని పీయూష్ గోయల్ అనలేదన్నారు. ఇన్నేళ్లుగా ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. మంత్రులను ఢిల్లీకి పంపితే న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీకి పోతానని..తర్వాత ఎందుకు పోలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కారం కావాలని కేసీఆర్ కు లేదని..ధాన్యం కొనుగోళ్ల సమస్య కొనసాగాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ఆరోపించారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ నెంబర్ వన్ అని..ముఖ్యమంత్రికి కావాల్సింది సెంటిమెంట్ రాజకీయమే అన్నారు. కలెక్టర్లు సర్పంచ్ లకు ఫోన్లు చేసి బెదిరిస్తోంది నిజం కాదా అని నిలదీశారు.