కేసీఆర్ కి ఈడీ దాడుల భయం పట్టుకుంది… బండి సంజయ్.

కేసీఆర్ కి ఈడీ దాడుల భయం పట్టుకుందన్నారు బండి సంజయ్. మందు కలిపితే మంత్రి అవుతారని తెలిస్తే..టీఆరెస్ ఎమ్మెల్యేలు మందు కలపడానికి ప్రగతి భవన్ ముందు క్యూ కడుతారని అన్నారు…..ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడని.. వర్షాలతో రైతులు భయపడుతుంటే ప్రభుత్వం ధర్నాలు చేస్తుందన్నారు. వానాకాలం పంట కొనుగోలు చేస్తారా లేదా…? చెప్పాలని నిలదీశారు. అధికార పార్టీ ఆందోళనలు ఎందుకు చేశారో అర్థం కావడం లేదన్నారు. టీఆరెస్ నేతలు రైతు సమస్యల పై ధర్నాలు చేస్తున్నారా…? లేక అంతర్జాతీయ సమస్య కోసమా…? అని నిలదీశారు. ధర్నాలకొచ్చిన వాల్లే సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటున్నారంటే .. వాళ్ళు వాస్తవం తెలుసుకున్నారని అన్నారు.