బీజేపీ అస‌మ్మ‌తి నేత‌లు బండి సంజ‌య్‌తో భేటీ…

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్‌ని ఇబ్బంది పెట్టిన అస‌మ్మ‌తి రాగం కొంత సద్దుమణిగినట్లే అనిపిస్తుంది.. కొంతకాలంగా సీనియర్లను పట్టించుకోవడం లేదంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి… ఇప్ప‌టికే రెండు దఫాలుగా ర‌హ‌స్య భేటీలు నిర్వ‌హించిన బీజేపీ అస‌మ్మ‌తి నేత‌లు శుక్ర‌వారం బండి సంజ‌య్‌తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది…పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఉల్లంఘించే వారు ఎంత‌టివారైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఇటీవ‌లే బండి సంజ‌య్ హెచ్చరించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న‌తో అస‌మ్మ‌తి నేత‌లు కొంత దిగివచ్చినట్లే ఆని తెలుస్తోంది.. బండి సంజ‌య్‌తో జ‌రిగిన భేటీలో చాలా మంది నేత‌లు తాము పార్టీ లైన్‌లోనే ఉన్నామ‌ని పేర్కొన్నారు. మ‌రికొంద‌రు నేత‌లు అసలు తాము అస‌మ్మ‌తి నేత‌ల భేటీకే హాజ‌రు కాలేద‌ని కూడా చెప్పార‌ట‌. పార్టీ లైన్ ధిక్క‌రించే వారిపై పార్టీ కేంద్ర నాయ‌క‌త్వం ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో తెలుసు క‌దా అంటూ హెచ్చ‌రించిన బండి సంజ‌య్‌.. ఇకపై ఏ స‌మ‌స్య ఉన్నా త‌న‌తోనే మాట్లాడాల‌ని, ఏదైనా వుంటే చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకుందామ‌ని చెప్పార‌ట‌. దీంతో అస‌మ్మ‌తి నేత‌లు కూడా శాంతించినట్లుగా ఆని అంటున్నరు సీనియర్ నేతలు…