ఓల్డ్ సిటీలో రేపు జరిగే సమావేశానికి బండి సంజయ్..

పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నియోజకవర్గాల వారీగా బీజేపీ సమావేశాలు నిర్వహించనుంది. ఒక్కో నియోజకవర్గంలో సమావేశానికి 3 వేల మంది ప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించింది. రేపు ఓల్డ్ సిటీలో జరిగే సమావేశానికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హాజరుకానున్నారు. పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయనున్నారు….