బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకు చేరవేయాలి… బిజేపి ఎమ్మెల్యే అభ్యర్ధి చల్లా శ్రీలత రెడ్డి..,

హుజూర్ నగర్ లో బిఆర్ఎస్, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం బిజెపియే..బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత రెడ్డి..
హుజూర్ నగర్ లో టిఆర్ఎస్, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం బిజెపియే అని హుజూర్నగర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా శ్రీలత రెడ్డి స్పష్టం చేశారు. హుజూర్ నగర్ పట్టణ, మండల శక్తి కేంద్రాల ఇంఛార్జి, బూతు అధ్యక్షుల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మహిళలకి రిజర్వేషన్ కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని అన్నారు. బిజెపి మతతత్వ పార్టీ కాదని, అన్ని వర్గాల శ్రేయస్సును కోరుకునే లౌకిక పార్టీ అని అన్నారు. ముస్లింలకు త్రిపుల్ తలాక్ తొలగించి, ముస్లిం మహిళలకు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పెద్దపీట వేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులను నడుపుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుకుంటుందని విమర్శించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ ని మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తానని మంత్రి కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకు చేరవేయాలని, దేశంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా హుజూర్నగర్ లో బిజెపి జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జి కర్ణాటక ఎమ్మెల్సీ రవికుమార్, ప్రభారి ఈవి రమేష్, హుజూర్ నగర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, రాష్ట్ర నాయకులు సురేష్,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అంబాల నరేష్ గౌడ్, బిజెపి పట్టణ అధ్యక్షులు ఇంటి రవి, మండల అధ్యక్షులు కోటిరెడ్డి, నాయకులు గుండెబోయిన వీరబాబు, కేంద్రాల ఇన్చార్జీలు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.