బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేయడం హేయమైన చర్య..డీకే అరుణ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు..

*బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేయడం హేయమైన చర్య..*

-డీకే అరుణ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు

ముఖ్యమంత్రి గద్వాల్ పర్యటనకు ముందు పోలీసులు బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేయడం పై భగ్గుమన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.

ముఖ్యమంత్రి అతని కుటుంబ సభ్యులు ఎవరు ఎక్కడ పర్యటన చేసినా, బిజెపి నాయకులను కార్యకర్తలను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేయడం హేయమైన చర్యని డీకే అరుణ మండిపడ్డారు.

అరెస్ట్ చేసిన వారిని వెంటనే పోలీసులు విడుదల చేయాలని, లేకపోతే జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డీకే అరుణ హెచ్చరించారు.