బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్…బిజేపి అన్ని బాధ్యతలు నుండి తొలగింపు…

బిజేపి అన్ని బాధ్యతలు నుండి తొలగింపు*

భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పార్టీ వేటుపడింది. మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీ స్పందించింది. భారతదేశ విచ్చినానినికి, దేశ సమగ్రతకు భంగం కల్పించేలా ఆయన వ్యాఖ్యలు ఉండడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీ లైన్ దాటారన్న నెపంతో రాజాసింగ్ ను సస్పెన్షన్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. గతంలో నుపూర్ వ్యాకలకంటే దారుణంగా రాజాసింగ్ మాట్లాడారని వాదన మొదలైంది. ఇప్పటికే ఎల్బీనగర్, బాలాపూర్ పోలీస్స్టేషన్లో రాజాసింగ్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. రాజాసింగ్ పై చర్య తీసుకోకపోతే దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం కేంద్రం వద్ద ఉంది. భారతీయ జనతా పార్టీ లైన్ దాటి ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణలు మిన్నంటాయి. ప్రస్తుతం రాజాసింగ్ 10 రోజుల్లో పార్టీకి జవాబు ఇవ్వాల్సి ఉంది. రాజాసింగ్ కు నోటీసులు జారీ అయ్యాయి..