రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు..!!

మునుగోడు నియోజకవర్గంలోని పలివెల గ్రామంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారని నిరసిస్తూ..
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ బీజేపీ మండల అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య ఆధ్వర్యంలో పెద్ద షాపూర్ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ తర్వాత ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నాయకులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ..గ్రామస్తులను ఉద్దేశించి ఈటల మాట్లాడుతుండగా.. అప్పటికే అక్కడికి కేటీఆర్ రోడ్డు షోలో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలతో చేరుకున్నారు. ఈటల ప్రసంగానికి ఆటంకం కలిగించేలా టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ప్రతిగా నినాదాలు చేయగా.. టీఆర్ఎస్ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి జెండా కట్టెలు, రాళ్లతో దాడికి దిగారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి.