బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్‌ పదవికి హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజీనామా యోచన…!!

బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్‌ పదవికి హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది.
గత కొద్దిరోజుల నుండి ఈటెల రాజేందర్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా ఇదే విషయంపై చర్చించినట్లుగా ఆయన వర్గీయులు ప్రచారం జరుగుతుంది..

కీలకమైన ఆ పదవి నుంచి తనను తప్పించాలని ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేడీ నడ్డా, మరో సీనియర్‌ నేత అమిత్‌ షాను కోరినట్లు సమాచారం. నడ్డా నివాసంలో కీలక భేటీ జరిగింది. ఈ భేటీలోనే ఈటల తనను చేరిక కమిటీ నుంచి తప్పించాలని కోరారు. అంతేకాదు.. చేరికల కమిటీ సమావేశంలోనూ పాల్గొనేందుకు ఆయన ఆసక్తి ప్రదర్శించడం లేదు. పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులకు టికెట్‌ భరోసా ఇవ్వకుండా ముందుకు వెళ్లకుండా సాధ్యం కాదని, అది చాలా కష్టమని భావిస్తున్న ఈటల..ఈటలకు సర్దిచెప్పే యత్నం చేయగా.. ఆయన రాజీనామా వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ పరిణామం.. తదనంతర ఫలితాలపై పార్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల ఓటమి తర్వాత బీజేపీలో చేరికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో చేరికలు ఆగిపోవడానికి మీరంటే మీరు కారణమంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు..