కేసీఆర్ మీద పోటీకి ఈటెల జమున సై…

.

గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దర్ఖస్తులు ఆహ్వానించగా నిన్నటితో గడువు ముగిసింది.

మొత్తం 6,003 దరఖాస్తులు రాగా చివరిరోజు 2,780 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, లక్ష్మణ్ దరఖాస్తు చేసుకోలేదు.

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుండి దరఖాస్తు చేయగా హుజూరాబాద్ నుండి ఈటెల రాజేందర్, గజ్వేల్ నుండి ఆయన సతీమణి ఈటెల జమున దరఖాస్తు చేసుకున్నారు.