మోడీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తోంది ..బీజేపీ నేత ఈటల రాజేందర్..

మోడీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. యాదాద్రిలో ఈటల ఆధ్వర్యంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీని మూడోసారి ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రజలకు భ్రమలు తొలగుతున్నాయన్నారు. ఉచిత బస్సు పథకంలో ప్రయాణికులు పెరిగినా.. బస్సులు పెరగలేదన్నారు. అప్పు కోసం కేంద్రం చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నారన్నారు. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా లాభం లేదన్నారు. బీజేపీకి ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదన్నారు. అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తా అన్నారు..