బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై..!!

ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ తిరిగి ఈ రోజు బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై సారధ్యంలో..ఆమె బీజేపీ కండువా కప్పుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. కాగా తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆమె గత 20 సంవత్సరాలుగా బీజేపీ నాయకురాలిగానే కొనసాగుతున్నారు.

అయితే 2019 లో కేంద్ర ప్రభుత్వం ఆమెను తెలంగాణ గవర్నర్‌గా నియమించడంతో.. గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉండి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం కోసం గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె ఈ రోజున తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడులో తమిళిసైకి ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు.బీజేపీలో చేరిన తర్వాత, తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. “నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాను. నేను బీజేపీ సభ్యత్వాన్ని రిగి తిరిగి పొందడం నాకు సంతోషంగా ఉంది. ఇది నాకు సంతోషకరమైన రోజు. గవర్నర్‌గా నాకు చాలా సౌకర్యాలు ఉన్నప్పటికి ఆ పదవిని విడిచి పెట్టాను. అందుకు నేను ఒక్క శాతం కూడా చింతించను. రాబోయే రోజుల్లో తమిళనాడులో కమలం వికసిస్తుందని తమిళిపై ధీమా వ్యక్తం చేశారు..