బీజేపీలో చేరనున్న ఉప్పల్ BRS ఎమ్మెల్యే!..

హైదరాబాద్ ఉప్పల్ BRS ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి BJPలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో BJPలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు BRS టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ BJP నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారు. కాగా, ఇప్పటి వరకు ఉప్పల్ MLA అభ్యర్థిని బీజేపీ ప్రకటించలేదు….
ఇక తాజాగా బీజేపీ నేత, మాజీ ఎంపీ గడ్డం వివేక్ కమలం పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని వివేక్ అన్నారు. కేసీఆర్‌ కుటుంబం తమ కుటుంబ ఆకాంక్షల మేరకే పనిచేస్తోందని.. ప్రజా సంక్షేమం ఆ పార్టీకి పట్టడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌లో చేరానని చెప్పుకొచ్చారు..