సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో నిరుద్యోగులతో బండి సంజయ్ సమావేశం..

చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో నిరుద్యోగులతో బండి సంజయ్ సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. చాలా ఏళ్లుగా అప్పులు తెచ్చి చదువుకుంటున్నామని యువకులు అవేదన వ్యక్తం చేశారు… సీఎం ఇంట్లో ఐదు ఉద్యోగాలున్నాయని.. వారికి నెలకు 16 లక్షల జీతం వస్తోందన్నారు. మరి రాష్ట్రంలోని యువకుల సంగతేంటని ప్రశ్నించారు సంజయ్. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఈనెల 16 న మిలియన్ మార్చ్ చేపడతామని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు….. నిరుద్యోగ మిలియన్ మార్చ్ ఎర్పాటు చేస్తాం అన్నారు..కేసీఆర్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడకుండా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ నెల 16 న నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు..అది ఆగాలంటే ఉద్యోగ నోటిికేషన్లు రిలీజ్ చెయ్యాలి అన్నారు.