బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల 55 మందితో తొలి జాబితా విడుదల…

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పోలింగ్‌కు మరో 40 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించటంతో పాటు బీఫామ్స్ కూడా అందజేసింది. కాంగ్రెస్ కూడా 55 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. రేపో మాపో రెండో జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలపై సస్పెన్స్ వీడటం లేదు. బీజేపీ ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.


కాగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ 55 మందితో తొలి జాబితాకు ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. కానీ అధికారికంగా మాత్రం వెల్లడించటం లేదు. అందుకు మరికొంత సమయం పట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులుగా ఖరారైన వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేరుగా ఫోన్‌ చేసి చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శనివారం (అక్టోబరు 21) సుమారు 25 మందికి పైగా అభ్యర్థులకు కిషన్‌రెడ్డి, బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ప్రకాశ్‌ జావడేకర్‌ ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. గెలుపే లక్ష్యంగా పూర్తిస్థాయిలో పని చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఇవాళ మిగిలిన అభ్యర్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఇక ఈసారి కిషన్ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ బరిలో నిలుస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోధ్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కోరుట్ల నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈటల రాజేందర్ హుజురాబాద్‌తో పాటు సీఎం పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి కూడా బరిలోకి దిగనున్నారు. సీఎం పోటీ చేస్తున్న మరో స్థానం కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీకి సై అంటున్నారు. ఇక కిషన్ రెడ్డితో పాటు, లక్ష్మణ్ పోటీకి విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ అంశం కూడా తెరపైకి వస్తుంది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి గోషామహల్ నుంచి మరోసారి బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు నేడో రేపో తొలి జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.

*బీజేపీ లిస్ట్*

సిర్పూర్ – పాల్వాయి హరీశ్ బాబు

బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి

ఖానాపూర్ (ఎస్టీ) – రమేశ్ రాథోడ్

ఆదిలాబాద్ – పాయల్ శంకర్

బోథ్(ఎస్టీ) – బాపూరావ్

నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి

ముథోల్ – రామరావు పటేల్

ఆర్మూర్ – రాకేశ్ రెడ్డి

జుక్కల్ (ఎస్సీ) – టి. అరుణతార

కామారెడ్డి – వెంకటరమణారెడ్డి

నిజామాబాద్ అర్బన్ – సూర్యనారాయణ గుప్తా

బాల్కొండ – అన్నపూర్ణమ్మ

కోరుట్ల – ధర్మపురి అర్వింద్

జగిత్యాల – బోగా శ్రావణి

ధర్మపురి(ఎస్సీ) – ఎస్ కుమార్

రామగుండం – సంధ్యారాణి

కరీంనగర్ – బండి సంజయ్ కుమార్

చొప్పదండి(ఎస్సీ) – బొడిగే శోభ

సిరిసిల్ల – రాణి రుద్రమ రెడ్డి

మానకొండూరు (ఎస్సీ) – ఆరెపల్లి మోహన్

హుుజురాబాద్ – ఈటల రాజేందర్

నర్సాపూర్ – ఎర్రగొల్ల మురళీ యాదవ్

పటాన్ చెరు – నందీశ్వర్ గౌడ్

దుబ్బాక – రఘునందన్ రావు

గజ్వేల్ – ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్

ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్

మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్

ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి

కార్వాన్ – అమర్ సింగ్

గోషామహల్ – రాజాసింగ్

చార్మినార్ – మేఘా రాణి

చంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్

యాకుత్ పుర- వీరేందర్ యాదవ్

బహుదూర్ పుర – వై నరేశ్ కుమార్

కల్వకుర్తి – టి. ఆచారి

కొల్లాపూర్ – సుధాకార్ రావు

నాగార్జున సాగర్ – నివేదితా రెడ్డి

సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు

భువనగిరి – గూడురు నారాయణ రెడ్డి