మంత్రి కేటిఆర్ కు ఒక వినతి అంటున్న ఎమ్మెల్యే రాజాసింగ్..

R9TELUGUNEWS.COM.
వ్యక్తిగతంగానే హైదరాబాదులో తిరుగుదామని మంత్రి కేటిఆర్ రిక్వెస్ట్ చేస్తున్నా.. ఇందులో పొలిటికల్ యాంగిల్స్ ఏమీ లేవని రాజాసింగ్ స్పష్టం చేశారు….మీరు హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో బాగా మాట్లాడుతారని మంత్రి కేటీఆర్ ను అన్నారు. అంతేకాకుండా.. ఇప్పుడు హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది.. మీరు, నేను ఇద్దరం బైక్ పై నగరంలో తిరుగుదాం అని కేటీఆర్ ను కోరారు. వర్షం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనిద్దరం చూద్దామన్నారు. చిన్న వర్షం వస్తేనే హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుందో కేటీఆర్ కు అర్థమవుతుందన్నారు.