రేవంత్ రెడ్డిది ఏబీవీపీ సంస్కారం అని, ప్రధానిని ఆహ్వానించడం జెంటిల్‌మేన్ తీరు ఉందిల..ఎంపీ అభ్యర్థి మాధవిలత..

ఎంపీ అభ్యర్థి మాధవిలత మాట్లాడుతూ.. ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి చాలా చక్కగా అనిపించిందని తెలిపారు. ఆ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు.. డిప్లమ్యాటిక్ చీఫ్ మినిస్టర్‌ల రేవంత్ వ్యవహరించారని అన్నారు. రేవంత్ రెడ్డిది ఏబీవీపీ సంస్కారం అని, ప్రధానిని ఆహ్వానించడం జెంటిల్‌మేన్ తీరు ఉందని హర్షం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఇంకా కొన్ని రోజులు గడిస్తే కానీ చెప్పలేమన్నారు.

ప్రధాని మోడీ రెండు రోజుల తెలంగాణ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మరోవైపు ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి ఆహ్వానించారు.
ప్రభుత్వ ప్రొగ్రామ్‌లో ఇద్దరు కలిసి స్పీచ్‌లు ఇచ్చారు. చివరిగా బేగంపేట్ ఎయిర్ పోర్టులో బుధవారం ప్రధానికి వీడ్కోలు పలికారు. సభలో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే గుజరాత్ మోడల్‌ను అనుసరించాలని అన్నారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.