బీజేపీ ఎంపి అభ్యర్దిగా స్వామి పరిపూర్ణానంద పోటీ..!!?

బీజేపీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారం దక్కించకొనే దిశగా హ్యాట్రిక్ విజయం కోసం పావులు కదుపుతోంది…
ఈ సారి ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి బీజేపీ ఎంపి అభ్యర్దిగా స్వామి
పరిపూర్ణానంద పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పరిపూర్ణానంద సన్నిహితంగా ఉంటారు. తెలంగాణలో కాంగ్రెస్ 12 ఎంపీ స్థానాలు గెలుస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి సిట్టింగ్ సీట్లతో పాటుగా మల్కాజ్ గిరి, చేవెళ్ల ఖచ్చితంగా గెలవాలని బీజేపీ టార్గెట్ గా ఫిక్స్ చేసింది. దీంతో, మల్కాజ్ గిరి లేదా ఏపీలోని హిందూపూర్ స్థానాల్లో స్వామి పరిపూర్ణానంద పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

రెండు సీట్లలో పరిశీలన : హిందూపురంలో హిందూ మత ప్రచారం, వ్యాప్తిలో స్వామి పరిపూర్ణానంద కొంత కాలంగా యాక్టివ్ గా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావటం..దక్షిణాది రాష్ట్రాలు, భాషల్లో పట్టుుండటం ఆయనకు కలిసొచ్చే అంశం. టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్న స్వామి పరిపూర్ణానంద కు సీటు కేటాయింపు అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకల్లో స్వామి పరిపూర్ణానంద పాల్గొంటున్నారు. ఈ వేడుక తరువాత సీట్ల కేటాయింపు గురించి బీజేపీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది..