బీజేపీ లోక్‌సభ రెండో జాబితా విడుదల..

బీజేపీ తెలంగాణ రెండో
జాబితా విడుదల
లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ బుధవారం రెండో విడత అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. తాజాగా 72 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేయగా.. ఇందులో తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కింది..

* ఆదిలాబాద్ – గోడం నగేశ్
* పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్
* మెదక్ – రఘునందన్ రావు
* మహబూబ్నగర్ – డీకే అరుణ
* నల్గొండ – సైదిరెడ్డి
* మహబూబాబాద్ – సీతారాం నాయక్.
తెలంగాణలో ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించగా.. నిజామాబాద్ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్, కరీంనగర్ బండి సంజయ్, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, మల్కాజిగిరి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవి లతను అభ్యర్థులగా బరిలో దింపింది. తెలంగాణలో 17 స్థానాలుండగా ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్‌, ఖమ్మం స్థానాల అభ్యర్థుల పేర్లు పెండింగ్‌లో పెట్టింది..