ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష..

ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు ఎట్టకేలకు పోలీసులు అనుమతిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమై… సాయంత్రం 4గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ముందుగా దీక్షకు అనుమతి ఇవ్వని పోలీసులు…బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లటంతో… చివరికి అనుమతి ఇచ్చారు. దీంతో దీక్షలో పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు… కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను సభకు అనుమతించే విషయంపై హైకోర్టు తీర్పును స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు.. పార్టీ నేతలు అసెంబ్లీలో తనను చూడొద్దన్నదే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన అని విమర్శించారు… బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. అందుకే సభ మొదలైన కొద్ది నిమిషాలకే తమను సెషన్ మొత్తం సెస్పెండ్ చేశారని అన్నారు. హైదరాబాద్​ ఇందిరాపార్క్​ దగ్గర ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టింది బీజేపీ. అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యేల సస్పెన్షన్.. హైకోర్టు సూచనలను స్పీకర్​ తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఈ దీక్షకు దిగింది. ఈటల రాజేందర్‌, రాజాసింగ్, రఘునందన్‌, మాజీ మంత్రి విజయ రామారావు సహా ఇతర బీజేపీ నేతలు మాట్లాడుతు..కేసీఆర్‌‌ కు ప్రజలు బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. కేసీఆర్, హరీష్ రావుకు దమ్ముంటే బడ్జెట్ పై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు ఈటల. హరీష్ వి దొంగలెక్కలని కాగ్ నివేదిక ఇచ్చిందన్నారు. “మిస్టర్ కేసీఆర్.. నీ పని ఖతం. ఈసారి గెలిచేది బీజేపీ, ఓడేది టీఆర్‌ఎస్‌. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. పీకే కూడా కాపాడలేరు” అంటూ మండిపడ్డారు. ఇకపై పల్లెల్లో దీక్షలు పెడతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ప్రజల విశ్వాసం కోల్పోయారు కాబట్టే పీకేను తెచ్చుకున్నారని సెటైర్లు వేశారు. తెలంగాణలో పీకే పనికిరాడని.. ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం, చైతన్యం మాత్రమే పని చేస్తుందన్నారు…