ఎన్నికల సమర శంఖం పూరించనున్న బీజేపీ…

ఎన్నికల సమర శంఖం పూరించనున్న బీజేపీ..

రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు.._

ప్రచార రథాలకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పూజలు.._

ఐదు క్లస్టర్లలో బస్సు యాత్రల ప్రారంభానికి ఏర్పాట్లు.._

ముఖ్య అతిథులుగా అసోం, గోవా సీఎంలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..

తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా యాత్రలు..

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం పూరించేందుకు భాజపా సిద్ధమైంది.

రాష్ట్రం లోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా.. ఆ పార్టీ.. ప్రజల వద్దకు వెళ్లనుంది.

రేపటి నుంచి చేపట్టే విజయ సంకల్ప యాత్రలకు అన్ని ఏర్పాట్లు చేసింది..

చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార రథాలను ప్రారంభించనున్నారు….

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల వద్దకు వెళ్లనుంది. ఈ మేరకు ఫిబ్రవరి 19 నుంచి చేపట్టే విజయ సంకల్ప యాత్రలకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రచార రథాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేయనున్నారు…తెలంగాణలో కమలదళం దూకుడు పెంచింది. 17 లోక్‌ సభ సీట్లపై గురి పెట్టింది. హైదరాబాద్‌లో ఎంఎంఐను ఓడించాలే వ్యూహాలను పదను పెడుతోంది టీబీజేపీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కన్నా సీట్లతో పాటు ఓట్ల శాతం కూడా పెరగడంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత సత్తా చాటేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఐదు యాత్రాలతో యాక్షన్‌ ప్లాన్‌ చేపట్టింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఫస్ట్‌ వరకు తెలంగాణ వ్యాప్తంగా యాత్రలకు రంగం సిద్దమైంది. కేంద్రంలో 400 ప్లస్‌ పక్కా..తెలంగాణ గతంలో కన్నా ఎక్కువ గెలుస్తామన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి.

వేల కిలోమీటర్ల యాత్ర..
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలు చుట్టేయాలని కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు17 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించింది. ఐదు క్లస్టర్లలో భాగంగా మొత్తం 4,238 కిలోమీటర్ల మేర ఈ రథయాత్రలు సాగనున్నాయి. యాత్రల ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి..