తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ గతంలో చాలా పొలిటికల్ సృష్టించిన కవిత అరెస్టు ఆగిన తర్వాత బిజెపి కొంత వెనుకబడిందని బిజెపి వర్గాల్లో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి…
దీంతో బిజెపిలోనే తెలంగాణ నాయకులు కూడా ఆ పార్టీపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది… ఇప్పుడు అలా కాకుండా
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది…
రాష్ట్ర బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అధిష్టానం పిలుపుతో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ ఢిల్లీకి బయర్దేరారు. ఇప్పటికే బండి సంజయ్ డిల్లీలోనే ఉన్నారు.రాష్ట్ర బీజేపీ నేతలతో జాతీయ నేతలు సమావేశంకానున్నారు. తెలంగాణ బీజేపీ పార్టీ పరిస్థితిపై నేతలు చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై రాష్ట్ర నేతలకు బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది…