హస్తినలో తెలంగాణ బీజేపీ నేతలు బిజీ..బిజీ గా..!!!

Delhi: హస్తినలో తెలంగాణ బీజేపీ నేతలు బిజీ..బిజీ గా గడుపుతున్నారు. Delhi: హస్తినలో తెలంగాణ బీజేపీ నేతలు బిజీ..బిజీ గా గడుపుతున్నారు. ఫామ్‌ హౌస్ వ్యవహారం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసుల అంశంపై తెలంగాణ సర్కార్‌పై బీజేపీ హై కమాండ్‌ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. బీఎల్‌ సంతోష్‌ పేరును FIRలో చేర్చడంపై అగ్ర నాయకత్వం గరం..గరం అవుతున్నారు..ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై రాష్ట్ర నేతలకు హైకమాండ్‌ దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తోంది.. లీగల్‌ ప్రొసిడింగ్స్‌తో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై సమాలోచనలు చేయనున్నారు.. మరోవైపు ఫామ్‌ హౌస్ వ్యవహారంలో పరిణామాలను జాతీయ నాయకత్వానికి వివరించి..టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పై కౌంటర్‌ ఎటాక్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర అంశం కూడా ప్రస్తావనకు వచ్చే ఛాన్సుంది. ఇటీవల జరిగిన శిక్షణా తరగతులు, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర నేతలు అధిష్టానానికి తెలపనున్నారు..ఇక కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి ఇవాళ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు..