బీజేపీకి విజయశాంతి రాజీనామా…

*⚪తెలంగాణ*

▫️బీజేపీకి విజయశాంతి రాజీనామా

▫️కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖ పంపిన విజయశాంతి..

తెలంగాణ బీజేపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బిజెపి పార్టీకి తాజాగా సీనియర్ నేత విజయశాంతి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు విజయశాంతి. గత కొంతకాలంగా బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న విజయశాంతి… తాజాగా రాజీనామా చేశారు.

ఇక విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు సమాచారం అందుతుంది. కాగా గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న విజయశాంతి… తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక గత రెండు సంవత్సరాల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు విజయశాంతి. ఇక ఇప్పుడు బీజేపీ కి కూడా రాజీనామా చేశారు విజయశాంతి.