సుమారు 300 మంది పోలీసులు గాయపడగా.. ఓ నిరసనకారుడు మృతి చెందగా..
గాయపడ్డ వారి సంఖ్య తెలియలేదు…
హింసకు సంబంధించిన కేసులు 200 మందిని
ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ పోలీస్స్టేషన్లలో 20కిపైగా కేసులు…..
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మంగళవారం రిపబ్లిక్ డే రోజు మంగళవారం నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా చెలరేగిన హింస నేపథ్యంలో రైతు సంఘాల మధ్య చీలిక వచ్చింది. రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆందోళన నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాయి. మంగళవారం చోటు చేసుకున్న హింసను రెండు సంఘాలు ఖండించాయి. ఈ పద్ధతిలో నిరసనను కొనసాగించలేమని సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ నాయకుడు ఘామిపూర్ సరిహద్దులో వీఎం సింగ్ మాట్లాడుతూ తమ యూనియన్ రైతుల నిరసన నుంచి తక్షణమే ఉపసంహరించుకుంటుందని, నిరసన జరిగిన పద్ధతి ఆమోదయోగ్యం కాదన్నారు. ‘మేం మా ఆందోళనను నిలిపివేస్తున్నామని, కానీ రైతుల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందని’ పేర్కొన్నారు.రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసతో తనకు, తన సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తియాక్తో కలిసి ఆందోళన చేయలేదని తెలిపారు. రిపబ్లిక్ డేను అగౌరవపరచడం తమ ఉద్దేశం కాదన్నారు. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం వేరుగా ఉందని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. తాము సైతం నిరసన నుంచి వైదొలగుతున్నామని భారతీయ కిసాన్ యూనియన్ (భాను) అధ్యక్షుడు ఠాకూర్ భాను ప్రతాప్ సింగ్ అన్నారు. ‘ఢిల్లీలో జరిగిన హింసను చూసి బాధపడుతున్నానని, మా 58 రోజుల నిరసనను ముగించాను’ అన్నారు. మంగళవారం జరిగిన నిరసన సందర్భంగా సుమారు 300 మంది పోలీసులు గాయపడగా.. ఓ నిరసనకారుడు మృతి చెందగా.. గాయపడ్డ వారి సంఖ్య తెలియలేదు. హింసకు సంబంధించిన కేసులు 200 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ పోలీస్స్టేషన్లలో 20కిపైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు….