బోధన్ లో తీవ్ర ఉద్రిక్తత, 144 సెక్షన్ అమలు … శివాజీ విగ్రహం ఏర్పాటుతో ఇరువర్గాల మధ్య ఘర్షణ…

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం చోటుచేసుకుంది. బోధన్‌‌లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు…ఓ వర్గం నాయకులు విగ్రహ ప్రతిష్ట చేయడంపై ఓ వర్గం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. ఇరువర్గాలకు చెందిన నాయకులు, స్థానిక ప్రజలు అక్కడికి భారీగా చేరుకోవడంతో పరిస్థితి మరింత్ర ఉద్రిక్తంగా మారింది…నిజామాబాద్ పోలీసులుతో సహా, కామాారెడ్డి, నిర్మల్ నుంచి అదనపు బలగాలు బోధన్ కు చేరుకున్నాయి. స్వయంగా నిజామాబాద్ సీపీ నాగరాజు పరిస్థితిని సమీక్షించారు. బోధన్ లో 144 సెక్షన్ అమలు చేశారు. ఇతరులు బోధన్ లోకి రాకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణను అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ఘటనపై స్పందించిన…బండి సంజయ్….

బోధన్ లో హిందూ యువకులపై ఎంఐఏం, టీఆర్ఎస్, పోలీసులు కలిసి దాడి చేశారన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. బోధన్ లో శివాజీ విగ్రహం పెట్టడం కోసం మున్సిపాలిటీ తీర్మానం చేసింది. రాళ్ళ దాడి చేయడం మూర్ఖత్వం,తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. నగర సీపీ నానా బూతులు తిట్టి, లాఠీ ఛార్జీ చేశారు. గాల్లో రబ్బరు బుల్లెట్లు కాల్పులు చేశారు. నిజామాబాద్ సీ పీ గతంలో ఎంపీ అవుతానని ప్రకటించాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో కొందరు ఐఏఎస్ లు ప్రవర్తిస్తున్నారన్నారు బండి సంజయ్..సీపీకి సిగ్గుండాలి, రౌడీలా ప్రవర్తించాడు అధికారులు సంఘాలు ఏం చేస్తున్నాయి? శివాజీ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా? బైంసా లో జరిగినట్లే బోధన్ లో జరిగింది. నీలాంటి వాళ్ళని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు బండి సంజయ్. ప్రభుత్వం శివాజీ జయంతి చేస్తే అడ్డుకుంటుంది. ఎం ఐ ఏం ఏది చెప్తే రాష్ట్రంలో అది అమలు అవుతుంది. సిరిసిల్లలో 25 మంది బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు పెట్టారు. టీ ఆర్ ఎస్ గుండాలు దాడి చేస్తే చర్యలు ఉండవు. పోలీస్ లు టీ ఆర్ ఎస్ ఫ్రెండ్లీ గా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు బండి సంజయ్…