బోధన్‌లో కొనసాగుతున్న బంద్….

బీజేపీ, శివసేన, హిందూ వాహిని పిలుపు మేరకు బోధన్‌లో బంద్ కొనసాగుతోంది. పలుచోట్ల పోలీసులు దగ్గరుండి దుకాణాలను తెరిపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. బోధన్‌లో 144 సెక్షన్ కొనసాగుతోంది. బంద్‌కు ఎలాంటి అనుమతి లేదని.. బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ నాగరాజు స్పష్టం చేశారు.