రెజ్లర్లు రౌనక్ గులియా ఆమె భర్త అంకిత్ గులియా పై 50 లక్షలు మోసం చేసారని కేసు..!
Bodybuilder Cop Gave Rs 50 Lak
ప్రొఫెషనల్ రెజ్లర్లు రౌనక్ గులియా ఆమె భర్త అంకిత్ గులియా తన వద్ద నుంచి రూ.50 లక్షలు మోసం చేసారని తీహార్ జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ దీపక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెడితే వారు దారుణంగా మోసం చేసారని ఆరోపిస్తున్నారు.
ఆహార ఉత్పత్తుల బిజినెస్ పెడదామంటూ రెజర్లు రౌనక్ గులియా, ఆమె భర్త అంకిత్ గులియా తన వద్ద నుంచి రూ.50 లక్షలు మోసం చేశారని తీహార్ జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ దీపక్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిస్కవరీ ఛానెల్‌లోని ‘ఇండియాస్ అల్టిమేట్ వారియర్’ అనే రియాల్టీ షోలో జాతీయ, రాష్ట్ర రెజ్లింగ్ ఛాంపియన్ రౌనక్ గులియాను కలిశానని శర్మ తన ఫిర్యాదులో చెప్పారు. ఆమె రెజ్లర్ భర్త అంకిత్ హెల్త్ ప్రాడక్ట్స్ బిజినెస్ చేస్తున్నారని.. వారు పెట్టుబడిదారుల కోసం వెతుతున్న సమయంలో తనను కలిసారని వారి భారీ లాభాల వాగ్దానాలకు ఆకర్షితుడనై రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు శర్మ చెప్పారు. అయితే వారు తన డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరించినట్లు శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.