ఆలస్యమైనా వర్షాలు కురుస్తాయి..లాల్‌దర్వాజా బోనాల జాతరలో అమ్మపలుకు..

హైదరాబాద్:
ఇటీవల వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు,, బోనాల జాతర సందర్భంగా చల్లటికప్పుడే అ ందింది లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో చల్లటి కబురు తెలిపేరు..‘ఆలస్యమైనా వర్షాలు కురుస్తాయి. నన్ను నమ్మిన భక్తులను కాపాడుకుంటా. పాపాలు చేస్తే శిక్షించే బాధ్యత నాపై ఉంది. నాకు పూజలు నిర్వహించిన భక్తులను చల్లగా చూసుకుంటా. ఐదు వారాలు సాక పెట్టి, పప్పు బెల్లాలు నైవేద్యంగా సమర్పించండి. శాంతి పూజలు చేయండి’’ ..అంటూ సోమవారం లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనూరాధ పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు.