జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Jubilee Hills MLA Maganti Gopinath) వీరంగం..
జూబ్లీహిల్స్ లోని వెంగళరావ్‌నగర్‌లో ఆశ్చర్యానిరి గురిచేసింది. బోనాల సందర్భంగా తన ఫొటోను ఫ్లెక్సీలో ఎందుకు వేయలేదని గణేష్ అనే బీఆర్ఎస్ నాయకుని ఇంటికి పోలీసులు, అనుచరులతో వెళ్లాడు. తన ఫొటోను ప్లెక్సీలో ఎందుకు వేయలేదని నిలదీశాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెంట వచ్చిన అనుచరులు పోలీసులు ముందు గణేష్‌ను ఇంట్లోకి నెట్టేసి దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అవ్వగా.. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సొంత పార్టీ కార్యకర్తలపై దగ్గరుండి దాడి చేయించడం తీవ్ర దుమారం రేపుతుంది…