ఢిల్లీలో బాంబు పేలుడు…

దేశ రాజధాని నగరం ఢిల్లీలో బాంబు పేలుడు సంభవించింది. ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం సమీపంలో ఈ పేలుడు సంభవించింది.

బీటింగ్ రిట్రీట్ కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న రాజ్‌ప‌థ్‌కు కేవ‌లం 1.4 కిలోమీట‌ర్ల దూరంలోనే పేలుడు సంభ‌వించింది. పేలుడు ధాటికి సంఘ‌ట‌నాస్థ‌లంలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. పూల‌కుండిలో పేలుడు సంభవించిన‌ట్లుగా అధికారులు తెలిపారు. పేలుడుకు ఐఈడీ ఉప‌యోగించిన‌ట్లుగా నిర్ధార‌ణకు వ‌చ్చారు. ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం వద్ద భారీగా భద్రతను పెంచారు. ఘటనకు సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.