బీఆర్ఎస్ వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థిగా మారేప‌ల్లి సుధీర్ కుమార్..

బీఆర్ఎస్ వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ మారేప‌ల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫైన‌ల్ చేశారు. ఈ మేర‌కు కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థి ఎంపిక‌పై ఆ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని బీఆర్ఎస్ నాయ‌కుల‌తో కేసీఆర్ సుదీర్ఘంగా చ‌ర్చించారు. అనంత‌రం సుధీర్ కుమార్ పేరును ప్ర‌క‌టించారు. మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన సుధీర్ కుమార్ హ‌న్మ‌కొండ జ‌డ్పీ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు…2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడుగా, అధినేత కేసీఆర్‌తో కలిసిపనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు..