బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ)’గా వ్యవహరించే ఈ తరహా సాంకేతికతపై ప్రయోగాలు చేస్తున్నాయి. టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి సంస్థలతో సంచలనాలు సృష్టిస్తున్న ఎలన్ మస్క్ కూడా ‘న్యూరాలింక్’ అనే స్టార్టప్ ద్వారా ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు! మరో ఆర్నెల్లలో మనిషి మెదడులో చిప్ అమర్చే ప్రయోగాలకు సిద్ధమైనట్టు తాజాగా ప్రకటించారు. తమ సంస్థ తయారుచేస్తున్న బ్రెయిన్ ఇంప్లాంట్లు ప్రయోగానికి సిద్ధం కాగానే తాను స్వయంగా ఒక చిప్‌ను అమర్చుకుంటానని వెల్లడించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుట్టుగుడ్డివారికి సైతం చూపు తెప్పించే రెండు రకాల చిప్‌లను తయారుచేస్తున్నామని మస్క్ తెలిపారు. ఇక మూడోది. అతి ప్రధానమైనది.. మనిషి మెదడులో కీలకమైన మోటార్ కార్టెక్స్ (మన కదలికలను నిర్దేశించే అత్యంత ముఖ్యమైన భాగం ఇదే)ను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న ఇంప్లాంట్. ఆరు నెలల్లో మానవ ప్రయోగాలకు సిద్ధమంటూ మస్క్ ప్రకటించింది దీని గురించే. వెన్నుపూస తీవ్రంగా దెబ్బతినడం వల్ల అంగుళమైనా కదలలేక మంచానికే
మళ్లీ పూర్తిస్థాయిలో కదిలేలా చేయగలగడమే ఈ ఇంప్లాంట్ లక్ష్యం. మానవ ప్రయోగాలకు సంబంధించిన అన్ని పత్రాలనూ ఎఫ్‌డీఏ (అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ)కు సమర్పించామని మస్క్ చెప్పారు.
ఇలా పనిచేస్తుంది..
న్యూరాలింక్ తయారుచేస్తున్న బ్రెయిన్ చిప్ పేరు ఎన్1. మన చేతికి పెట్టుకునే గడియారం డయల్ కన్నా చిన్నగా ఉంటుందిది. దీన్ని.. న్యూరాలింక్ కంపెనీయే తయారుచేసిన ఒక ‘సర్జరీ రోబో’ ద్వారా మెదడులో అమర్చుతారు. అప్పట్నుంచీ, అది మన మస్తిష్కంలోని ఆలోచనలను గ్రహిస్తుంది. మెదడులో జరిగే కదలికలను రికార్డు కూడా చేస్తుంది. కదిలే సామర్థ్యం లేనివారు కదిలేలా చేస్తుంది. వారు చెప్పాలనుకున్న విషయాలను మాట్లాడకుండానే కంప్యూటర్ వంటి పరికరాల సాయంతో ఎదుటివారికి చేరవేయగలుగుతుంది. ఉదాహరణకు.. పక్షవాత బాధితులకు ఈ చిప్‌ను అమర్చితే వారు తమ ఉపయోగించగలుగుతారు. ఈ చిప్ ఎలా పనిచేస్తుందంటే.. మన తల వెంట్రుకల మందంలో ఇరవయ్యో వంతు ఉన్న అత్యంత సూక్ష్మమైన వైర్లను ఈ చిప్ ద్వారా మెదడుకు అనుసంధానం చేస్తారు. ఈ వైర్లలో 1024 ఎలకో్ట్రడులు ఉంటాయి. ఇవన్నీ మెదడు కదలికలను గమనిస్తూ, విద్యుత్ సంకేతాల ద్వారా మెదడును ఉత్తేజితం చేస్తాయి. ఆ సమాచారాన్ని వైర్‌లెస్ విధానంలో చిప్ ద్వారా కంప్యూటర్ లేదా ఫోన్ వంటి పరికరాలకు సరఫరా చేస్తాయి..
బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’ పరిజ్ఞానంపై న్యూరాలింక్ పేరు ప్రధానంగా వినిపిస్తోందిగానీ.. మరికొన్ని కంపెనీలు కూడా ఈ దిశగా చాలాకాలంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. చెప్పుకోదగ్గ ఫలితాలను కూడా సాధించాయి. ఉదాహరణకు.. బ్లాక్‌రాక్ న్యూరోటెక్ అనే కంపెనీ వచ్చే ఏడాదికల్లా ప్రపంచంలోనే తొలి బీసీఐ వ్యవస్థను మార్కెట్‌లోకి అందుబాటులోకి తెస్తామంటోంది. అలాగే.. సింక్రాన్ అనే మరో సంస్థ శాశ్వత బ్రెయిన్ ఇంప్లాంట్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఇప్పటికే ఎఫ్‌డీఏ అనుమతులు పొందింది. పారాడ్రోమిక్స్ అనే మరో సంస్థ కూడా 2023లో.. బ్రెయిన్ ఇంప్లాంట్లకు సంబంధించి మానవ ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతోంది…