తోకతో శిశువు జననం…

ఓ శిశువు తోకతో జన్మించింది..

. అప్పుడే జన్మించిన ఈ నవజాత శిశువుకి తోకతో పాటు తోక చివర బంతి కూడా ఉండటంతో డాక్టర్లు సైతం షాక్ తిన్నారు.

R9TELUGUNEWS.COM.
ఈ ఘటన బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. బ్రెజిల్‌లోని ఫోర్ట్‌లెజా అనే సిటీలో అల్బర్ట్ సాబిన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు డెలివరీ చేసిన డాక్టర్లు పుట్టిన శిశువును చూసి ఆశ్చర్యపోయారు.మగ బిడ్డ తోకతో జన్మించడంతో అవాక్కయ్యారు. చిన్నారికి దాదాపు 12 సెంటీమెటీర్ల తోకతో పాటు.. తోక చివరిలో బంతి వంటి ఆకారం కూడా ఉందని గుర్తించారు. అయితే తోక కేవలం చిన్నారి చర్మానికి మాత్రమే అంటుకొని ఉండటంతో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. నాడీ వ్యవస్థతో తోకకు ఎలాంటి సంబంధం లేవడంతో డాక్టర్లు శాస్త్ర చికిత్స నిర్వహించి దాన్ని వెంటనే తొలగించారు. అయితే గతంలో మహిళకు పరీక్షలు నిర్వహించినప్పుడు కడుపులో బిడ్డకు తోక ఉండటం వంటి ఎలాంటి ఆనవాళ్లు కూడా గుర్తించలేదన్నారు. జనన సమయంలో నాలుగు నుండి ఎనిమిది వారాలు గర్భధారణలో మొదట అండం తోకల రూపంలోనే పెరుగుతుంది. అయితే ఆ తర్వాత క్రమంగా నెలలు నిండే కొద్ది అవయవాలు ఏర్పడి పూర్తి మానవశరీరం వచ్చేసరికి తోక‌లు కానిపించకుండ పోతోంది… కానీ తాజాగా జన్మించిన బాబుకు అనూహ్యంగా పిండం తోపాటు తోక కూడా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు..