తాజాగా బ్రిటన్ లో ఏర్పడిన సంక్షోభంతో మరోసారి రేసులోకి రిషి సునక్..!!

తాజాగా బ్రిటన్ లో ఏర్పడిన సంక్షోభంతో మరోసారి రేసులోకి రిషి సునక్ వచ్చారు… ప్రస్తుత ప్రధాని లిజ్ ట్రస్ సంక్షోభంతో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆమె చేతిలో ఓడిపోయిన రిషి సునక్ తాజాగా మళ్లీ రేసులోకి వచ్చాడు…

మొన్నీ మధ్యనే బ్రిటన్ ప్రధాని పదవిని తృటిలో చేజార్చుకున్న మన భారతీయుడు, మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషిసునక్..

బ్రిటన్ ప్రధాని కావడానికి రిషి సునక్ కు మరో అవకాశం వచ్చింది. అక్కడ ఏర్పడిన సంక్షోభంతో మరోసారి ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తాను బరిలో ఉంటానని రిషి సునక్ ప్రకటించాడు. ప్రధాని పదవి రేసులో ఉండడానికి ఇప్పటికే కనీస నామినేషన్ పరిమితిని దాటాడు. 140 మంది ఎంపీల మద్దతు తనకు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రిషి సునక్ కు పోటీగా బోరిస్ జాన్సన్ ఉండే అవకాశం ఉందని వార్తలు ప్రస్తుతం ఆయన కరేబియన్లో రిలాక్స్ అవుతున్నారు. చట్ట సభ సభ్యుల మద్దతు పొందేందుకు అక్కడి నుంచి హూటాహుటిన బయలు దేరాడు..బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు పోటీగా రంగంలోకి దిగిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రిషి సునక్ కంటే వెనుకబడి ఉన్నానని.. ఇలాంటి సమయంలో పోటీ నుంచి వైదొలగడమే మేలని బోరిస్ వెల్లడించాడు. కీలక పోటీదారు బోరిస్ పోటీ నుంచి వైదొలగడం.. రిషిసునక్ ప్రధాన పోటీదారు పెన్నీ మోర్డాంట్ కు మెజారిటీ అంతంత మాత్రంగానే కనిపిస్తుండడంతో బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ విజయానికి మార్గం సుగమమైనట్టే కనిపిస్తోంది. దీనిపై ఈ మధ్యాహ్నమే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

బోరిస్ జాన్సన్ పోటీ నుంచి తప్పుకోవడంతో రిషి సునక్ కు మరింత మద్దతు పెరిగింది. 156 మంది పార్టీ ఎంపీలు మద్దతిస్తే రుషి డైరెక్ట్ గా ప్రధాని అవుతాడు. ఇంతకు ముందులా పార్టీ సభ్యులంతా ఓట్ చేయనక్కర్లేదు.. ఇప్పటికే 142 మంది మద్దతు రిషికి వచ్చింది. బోరిస్ తప్పుకోవడంతో మిగిలిన మద్దతు కూడా ఇవ్వాళే రావొచ్చని సమాచారం. దీంతో దాదాపు మన రుషి బ్రిటన్ ప్రధాని కావడం ఖాయం. బ్రిటన్ లో ఉండే భారతీయులకు దీపావళి మరింత తీపిగా ఉండబోతుందని చెప్పకతప్పదు.

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో ఆమె రాజీనామా చేశారు. ఆమె రాజీనామా తరువాత వెంటనే ఈ పదవిని క్లెయిమ్ చేసుకునేందుకు రిషి సునక్ సిద్ధమయ్యాడు…