బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్‌…

*భారత్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన రిషి సునాక్*
*చరిత్ర సృష్టించిన రిషి సునాక్…*
*బ్రిటన్ నూతన ప్రధానిగా ఏకగ్రీవం*
*నేడు నామినేషన్లకు తుదిగడువు*
*పోటీ నుంచి తప్పుకున్న పెన్నీ* *మోర్డాంట్*
*రేసులో రిషి సునాక్ ఒక్కరే మిగిలిన వైనం*
*సునాక్ కు 188 మంది ఎంపీల బలం*
*మోర్డాంట్ కు 27 మంది ఎంపీల మద్దతు*

బ్రిటన్‌ నూతన ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. ప్రధాని రేసులో నుంచి పెన్నీ మోర్డాన్‌ నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో యూకే పగ్గాలు చేపడుతున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.