బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దాడి..

హైదరాబాద్‍లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దాడికి గురైంది. కొంత మంది మహిళలు ఆమెను దూషించడమే కాకుండా.. దాడి చేశారు. ఆమె సర్థి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. వినిపించుకోకుండా, కారులో ఉండగానే.. ఆమెపై చేయి చేసుకున్నారు. కారు డ్రైవర్ వారిని ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. అయితే ఇది ఫ్లెక్సీ వివాదమని తెలుస్తోంది. ఆ స్థలంతో నీకేం పనే అంటూ మర్యాద లేకుండా.. సాటి మహిళ, ప్రజా ప్రతినిథి అని చూడకుండా అసభ్యకర పదజాలాన్ని వాడటమే కాకుండా.. చేయి చేసుకుందో మహిళ. ఈ ఘటన జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య కారులో వెళుతుండగా.. కొంత మంది మహిళలు అడ్డుకుని ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనలో దేదీప్యకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఫ్లెక్సీ వివాదం గురించి ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఎటాక్ అనంతరం దేదీప్య తన భర్త విజయ్ ముదిరాజ్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె కారు డోర్ ఓపెన్ చేసి మరీ మహిళలు కొడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి.

అందులో ఓ మహిళ కార్పొరేటర్‌తో గొడవకు దిగడం స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఆ స్థలంతో నీకేం పని ఇప్పుడు.నేనేవ్వరో నీకు తెలుసు. ఎవరికైనా ఫోన్ చేసుకో.. సీఐకి ఫోన్ చేస్తావా, ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తావా.. ఎవరికి చేస్తావ్? నువ్వేమన్నా ఎమ్మెల్యేవి అనుకుంటున్నావా..? ఏం అనుకుంటున్నావ్..’అంటూ కార్పొరేటర్ పై చేయి చేసుకుంది. కారు అద్దాలు మూసేయగానే.. అద్దాలపై దాడి చేసింది. దేదీప్య ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ… ఆమె వినిపించుకోకుండా.. అసభ్య పదజాలంతో తిడుతూనే ఉంది. ఈ ఘటనలో దేదీప్యకు స్వల్పగాయాలు అయ్యాయి. కాంగ్రెస్ నేతల అండతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించిన ఆమె.. భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు