కాంగ్రెస్ పతనం మొదలైంది అనే దానికి భౌతిక దాడులే నిదర్శనం.జగదీష్ రెడ్డి….

కాంగ్రెస్ గూండాల దాడిలో జమీర్ కు తీవ్ర గాయాలు

మెరుగైన వైద్య సేవల కోసం నల్లగొండకు తరలింపు.

మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత.

బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడి.
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.

* ఐకాన్ ఆస్పత్రిలో జమీర్ ను పరామర్శించిన జగదీష్ రెడ్డి, ఎంసీ కోటి రెడ్డి, భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహా రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ

నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు బరితెగించారు… గూండాగిరికి పాల్పడ్డారు. మిర్యాలగూడ పట్టణంలో 29వ వార్డు – బంగారుగడ్డలోని మ్యాడిసన్ హై స్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్ వద్ద జమీర్ అనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. 29వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జావిద్, ఆయన అనుచరులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన జమీర్ ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం నల్లగొండలోని ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ఐకాన్ ఆస్పత్రిలో వైద్య సేవలను పొందుతున్న జమీర్ ను మాజీ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి, మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహా రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను సూచించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ నేతలు అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు.