బిజెపి వైపు చెన్నమనేని రమేష్ చూపు…!!

వేములవాడు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ నేత ఈటల రాజేందర్‌తో రమేష్‌బాబు టచ్‌లోకి వెళ్లినట్లు జిల్లాలో ప్రచారం..?. ఈనెల 25న చెన్నమనేని రమేష్‌బాబు జర్మనీ నుంచి వేములవాడకు రానున్నారు. వేములవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా రమేష్‌ బాబును నిలబెట్టే అవకాశం ఉంది. నిన్న టిక్కెట్‌ దక్కకపోవడంతో భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను సోషల్‌ మీడియో చెన్నమనేని పోస్ట్‌ చేశారు.

ఇప్పటికే బిజెపి ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తో చెన్నయనేని మాట్లాడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత జర్మనీలో వున్న రమేష్ ఆగస్ట్ 25న వేములవాడకు వచ్చి ముఖ్య అనుచరులు, పార్టీ నాయకులతో భేటీ కానున్నారు. తనకు టికెట్ కేటాయించకపోవడంతో బిఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకున్న చెన్నమనేని ఏ పార్టీలో చేరాలన్నదానిపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వేములవాడలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిజెపిలో చేరడానికే ఎమ్మెల్యే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది…తన బాబాయ్, బిజెపి కీలక నేత చెన్నమనేని విద్యాసాగర్ రావుతో రమేష్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈటలతో కూడా మాట్లాడిన రమేష్ అనుచరులతో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నారు. అన్నీ కుదిరితే ఈసారి వేములవాడ నుండి బిజెపి అభ్యర్థిగా రమేష్ బరిలోకి దిగనున్నారు.

వేములవాడ నియోజకవర్గంలో తండ్రి చెన్నమనేని రాజేశ్వరరావు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు రమేష్. అయితే చెన్నమనేని పౌరసత్వంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈసారి బిఆర్ఎస్ టికెట్ ఆయనకు ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. దీంతో చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు బిఆర్ఎస్ అవకాశం కల్పించింది. దీంతో వారసత్వంగా తాము గెలుచుకుంటూ వస్తున్న వేములవాడ నియోజకవర్గాన్ని వదులుకోడానికి చెన్నమనేని కుటుంబం సిద్దంగాలేదు. అందుకోసమే చెన్నమనేని విద్యాసాగర్ రావు తన అన్నకొడుకు రమేష్ ను బిజెపిలోకి తీసుకువచ్చి వేములవాడ టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. .